04-04-2025 10:04:51 PM
సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్
కొండపాక: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ తమ ఛాంబర్ లో అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గరీమ అగర్వాల్ మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు. ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని వివిధ శాఖలు ఎడ్యుకేషన్, రెవెన్యూ, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్, ఆర్టీసీ, ట్రాన్స్పోర్ట్, పోస్టల్, ఎలక్ట్రిసిటీ, ఆయా శాఖలకు సంబంధించి విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు.
4 ఓపెన్ టెన్త్ పరీక్ష కేంద్రాలల్లో 564 మంది విద్యార్థులు, 5 ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలలో 896 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్కాట్స్ రూట్ ఆఫీసర్లు ఇన్విజిలేటర్లను నియమించాలని, మాస్ కాపీయింగ్ లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థులకు త్రాగునీరు,మరుగుదొడ్లు, అత్యవసర మందులు, పరీక్షా కేంద్రాలలో సమకూర్చాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలని అన్నారు.