సంప్రోక్షణకు దేశంలోని పుణ్య నదుల నుంచి పవిత్ర జలం సేకరణ
యాదాద్రి భువనగిరి జనవరి 30 (విజయక్రాంతి) ః ఫిబ్రవరి 19 నుండి 23 వరకు జరిగే యాదాద్రి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహా కుంభ సంప్రోక్షణ ఉత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ ఐ.ఏ.ఎ.స్ శ్రీధర్ కలెక్టర్ హనుమంతరావు తో కలిసి గురువారం యాదగిరిగుట్టలో సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పుణ్య నదుల నుండి పవిత్ర జలాన్ని సేకరించి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వ హించాలని వేద పండితులకు సూచించారు.
కార్యక్రమ నిర్వాహనకు సంబంధించి చేపట్టవలసిన చర్యలు. విచ్చేయు ప్రజా ప్రతినిధులు. ఉన్నతాధికారుల ఏర్పాట్లకు. భక్తుల సదుపాయాలపై చర్చించి అధికా రులకు దిశ నిర్దేశించారు. దివ్య విమాన, స్వర్ణ గోపుర పూజా కార్యక్రమాలను శాస్త్రోత్రంగా నిర్వహించుటకు పలు సూచనలు కమిషనర్ చేశారు. అన్ని శాఖల అధికారులు. సిబ్బంది సమన్వయంతో ఈ దైవ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని శ్రీధర్ సూచించారు.
పవిత్ర నది జలాల సేకరణకు బయలు దేరే అర్చక,వేద పండితుల కార్యక్రమాన్ని కమిషనర్, కలెక్టర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ కార్య నిర్వహణాధికారి భాస్కరరావు, దేవస్థాన అను వంశిక ధర్మకర్త నరసింహమూర్తి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి అదనపు డిప్యూటీ కమిషనర్ లక్ష్మీ కాంతారావు ఆర్డీవో కృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.