calender_icon.png 2 April, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిరుసనగండ్ల శ్రీ సీతారామ స్వామిబ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ

27-03-2025 12:38:03 AM

చారకొండ మర్చి 26: నాగర్కర్నూల్ జిల్లా, చారకొండ మండలం, శిరుసనగండ్ల శ్రీ సీతారామ స్వామివారి బ్రహ్మోత్సవాల జాతర నిర్వహణపై బుధవారం స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. భద్రతా చర్యలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై పలు సూచనలు చేశారు.

ఆర్థిక సహాయ నిధులు, పోలీస్ బందోబస్తు, తాగునీటి వసతి, మెడికల్ క్యాంపులు, రోడ్డు మరమ్మతులు, లైట్లు తదితర అంశాలపై చర్చించడంతో పాటు, జాతర విజయవంతం కావడానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి విభాగం బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.

వారితోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొల్యూషన్ బోర్డ్ మెంబర్  ఠాకూర్ బాలాజీ సింగ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, ఆలయ చైర్మన్ రామశర్మ, మాజీ జడ్పీటిసి వెంకట్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బలరాం గౌడ్, నాయకులు వెంకటయ్య యాదవ్, నరసింహ రెడ్డి, సాంబయ్య గౌడ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.