హైదరాబాద్, నవంబర్ 6(విజయక్రాంతి): తెలంగాణ స్పోర్ట్స్ అథా రిటీ బుధవారం గచ్చిబౌలి స్టేడియం లో సమావేశమై పలు అంశాలపై సమీక్షించింది. నవంబర్ నెలాఖరులోగా స్పోర్ట్స్ పాలసీ ముసాయి దాను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో.. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సమావేశమై.. పొందుపర్చాల్సిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, పీసీసీ అధ్యక్షులు, తెలంగాణ కరాటే అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.