29-03-2025 12:11:54 AM
శేరిలింగంపల్లి, మార్చి28(విజయక్రాంతి) : రంజాన్ పండుగను పురస్కరించుకొని మసీదుల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు వసతులను కల్పిస్తామని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు,వేడుకల నిర్వహణకు సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలను జిహెచ్‌ఎంసి పరంగా కల్పిస్తామ న్నారు.
జోన్ పరిధిలోని మాదాపూర్ డివిజన్ లోగల కాకతీయ హిల్స్ అలంగీర్ మసీ దును అధికారుల బృందం,మసీద్ ట్రస్ట్ సభ్యులతో కలిసి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మసీ దు వద్ద ప్రత్యేక పారిశుధ్య చర్యలను చేపట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాల ని అధికారులను ఆదేశించారు.
వీధి దీపాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని, గుంతలు పడ్డ రహదారులకు తక్షణ మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో మసీదుకు ప్రార్థనలు చేసేందుకు ముస్లింలు వచ్చే అవకాశం ఉందని అన్ని ఏ ర్పాట్లు చేయాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసి మోహన్ రెడ్డి, ఏసిపి నాగిరెడ్డి, డిఈ శ్రీదేవి, వైద్యాధికారి డాక్టర్ రవి, ఏఈ ప్రశాం త్ తదితరులు పాల్గొన్నారు.