ట్రాక్ పెట్రోలింగ్ ముమ్మరం: జీఎం జైన్
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): పలు చోట్ల రైల్వే లైన్లపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్లను ఉంచి ప్రమాదాలకు యత్నిం చిన ఘటనలు, పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యం లో దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది.
ఈ మేరకు ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ అరుణ్‌కు మార్ జైన్ సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో భద్రతపై సమీక్ష నిర్వహించారు. రైల్వేలో ఇటీవల చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనల దృష్ట్యా ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందాల సహాయంతో ట్రాక్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సేఫ్టీ డ్రైవ్‌లు, తరచుగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలన్నారు.
లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, గార్డులు, ట్రాక్‌మెన్‌లతో సహా భద్రతా సంబంధిత సిబ్బందికి సలహాలు ఇవ్వాలని అన్నారు. ట్రాక్‌ల వెంట పెట్రోలింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, రైళ్లను సురక్షితంగా నడిపేందు కు నిబంధనలను పాటించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
జోన్‌లో రైళ్లలో పొగను గుర్తించే పరికరాలు, అగ్నిమాపక పరికరాలు మొదలైన భద్రతా వస్తువుల లభ్యతను ఆయన సమీక్షించారు. ఎలాం టి అత్యవసరమైనా సరిపడా నిల్వలు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్యాసింజర్ కంప్లుంట్ రిడ్రెసల్ సిస్టమ్ ‘రైల్ మదద్’పై కూడా జీఎం సమీక్షించారు. త్వరగా ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు సూచించా రు.
లెవల్ క్రాసింగ్ గేట్ల తొలగింపుపై పరిస్థితిని సమీక్షించారు. వాటి తొలగింపునకై అవసరమైన చర్యలు తీసు కోవాలని సంబంధిత డివిజనల్ రైల్వే మేనేజర్లను ఆదేశించారు. సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికులు పనులు చేస్తున్నపుడు చేతి తొడుగు లు, హెల్మెట్లు, బెల్టులు మొదలగు భద్రతా పరికరాలను తప్పనిసరిగా ధరించాలని సూచించారు.