calender_icon.png 17 October, 2024 | 6:39 PM

నూతన జేకే ఉపరితల గని పనులపై సమీక్ష నిర్వహించిన : జియం

17-10-2024 03:53:10 PM

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లందు ఏరియాలోని  వై.సి.ఓ.ఎ క్లబ్, 24 ఏరియా నందు ఏరియా ఉన్నత అధికారులతో ఏరియా జియం జాన్ ఆనంద్ నూతన జేకే ఉపరితల గని పనుల పురోగతిపై సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలోని జేకే5 ఓసి, 21 ఇంక్లైన్ కలుపుతూ ఏర్పడబోయే నూతన జేకే బొగ్గు గని ఏర్పాటుకు సంభందించిన 151.85 హెక్టర్ల అటవీ భూమి వాడకానికి సూత్రప్రాయంగా అనుమతినిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

తదుపరి ఉత్తర్వుల కొరకు చేయవలసిన పనులకు సంభందించి సంభందిత అధికారులకు పవర్ పాయింట్ ద్వారా వివరించారు. తమకు కేటాయించిన నూతన ప్రాజెక్ట్ పనులు ఎటువంటి ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలనీ సంభందిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు.జి.యం బొల్లం వెంకటేశ్వర్లు, ఎజియం (ఐఇ) గిరిధర్ రావు, ఏరియా ఇంజనీర్ నరసింహ రాజు, ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణ మోహన్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రామస్వామి, డిజియం సివిల్ రవికుమార్, డిజియం సర్వే బాలాజీ నాయుడు, అధికారులు ధనుంజయ రెడ్డి, సంపత్ నాయక్, మధుబాబు, చెన్నయ్య, మహేశ్, పవన్ కుమార్, సాయి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.