calender_icon.png 21 April, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి ఏర్పాట్ల పరిశీలన

10-04-2025 02:15:46 AM

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 9 ( విజయ క్రాంతి ): మహాత్మా జ్యోతిబాపూలే 198వ విద్యార్థి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి యాదయ్య తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులతో కలిసి పట్టణంలోనీ జగదేవ్పూర్ చౌరస్తాలో ఉన్న పూలే  విగ్రహం వద్ద స్టేజి ఏర్పాట్లను పరిశీలించారు.

ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది  కలగకుండా సభ  నిర్వహించనున్నామని, కార్యక్రమానికి వచ్చే అతిధులకు  ఎటువంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు వేసి, మంచినీరు, మజ్జిగ సరఫరా చేస్తున్నట్లు నిర్వాహకులు  తెలిపారు.

ఏర్పాట్లను పరిశీలించిన వారిలో పూలే జయంతి వేడుకల కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, నాయకులు సిరికొండ శివకుమార్, చిన్నగారి కృష్ణ కొత్త, బాలరాజు, జూకంటి ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు