calender_icon.png 2 April, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ పార్టీ నేతలతో సమీక్ష సమావేశం

21-03-2025 12:57:49 AM

 రంగారెడ్డి, మార్చి 20 (విజయక్రాంతి) రంగారెడ్డి  జిల్లా సమీకృత  కార్యాలయాల సముదాయ భవనంలోని  గురువారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, డిఆర్‌ఓ సంగీతతో కలిసి జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా యొక్క నిరంతర ధృవీకరణ, వాటి సమర్పణ, 20.03.2025 నాటికి పెండింగ్లో ఉన్న  6,7 & 8 ఫారమ్లు, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం వంటి పలు అంశాలపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్  ప్రతిమాసింగ్ మాట్లాడుతూ తెలంగాణ సీఈఓ సూచనల మేరకు అసెంబ్లీ స్థానాలల్లో పోలింగ్ కేంద్రాలు, వాటికి కేటయించిన బూత్ లెవల్ ఆఫీసర్లకు సంబంధించిన వివరాలను వివరించినట్లు చెప్పారు.

జిల్లా లో యల్.బి.నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, చేవేళ్ళ, షాద్ నగర్, కల్వకుర్తి, ఇబ్రహింపట్నం నియోజక వర్గాలలోని గ్రామీణ ప్రాంతంలో 1065, పట్టణ ప్రాంతంలో 2436 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. వీటికి మొత్తంగా 3501 బూత్ లెవల్ పోలింగ్ ఆఫీసర్లను ఇంతక ముందే నియమించామన్నారు. లింగ ప్రాతిపాదికన 20.03.2025 నాటి వరకు మొత్తం 8 నియోజకర్గాల్లో పురుషులు 1889115, స్త్రీలు 1785501,  ట్రాన్స్ జెండర్ 434 గా ఉండగా మొత్తం ఓటర్లు 36,75,050 ఉన్నారన్నారు.ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న ఫాం 6,7,8 ఫామ్ లను త్వరగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు.  గతంలో ఎన్నికల సమయంలో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల పెండింగ్ కు సంబంధించి పూర్తి వివరాలు అందజేయని అభ్యర్థులు త్వరగా అందించాలన్నారు.

వీటిపై ఎలక్షన్ కమీషన్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే తరుణంలో రాజకీయ పార్టీల నుండి నియమించాల్సిన బూత్ లెవల్ ఏజెంట్లను త్వరగా నియమించాలని, వారి వివరాలను ఇఆర్‌ఓలకు పార్టీ నాయకులు త్వరాగా అందజేయాలని సూచించారు.  సమీక్ష సమావేశంలో  కాంగ్రెస్, బిఆర్‌ఎస్, సిపియం, సిపిఐ, బిఎస్పి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.