22-03-2025 01:29:16 AM
నాగర్ కర్నూల్ మార్చి 21 (విజయక్రాంతి) శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు రెస్క్యూటిమ్ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నా యి. ప్రమాద స్థలి 14వ కిలోమీటర్ వద్ద నేటికీ కొనసాగుతున్న నీటిఊట, బురద తీవ్రత నుంచి బయటపడేందుకు రెస్క్యూటిమ్ బృందాలతో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు.
మిగతా ఏడుగురి కోసం ర్యాట్ హోల్ మైనర్స్, కేరళ కడవర్ డాగ్స్, ఎన్డిఆర్‌ఎఫ్, ఎస్డిఆర్‌ఎఫ్, ఆర్మీ, ఇండియన్ రైల్వే వంటి రెస్క్యూటిమ్ బృందాలు నిర్విరామం గా శ్రమిస్తున్నాయి. ప్రమాదం జరిగి 28 రోజులు గడుస్తున్నా కార్మికుల ఆనవాళ్లు లభించకపోవడంతో సాధ్య అసాధ్యులు జాగ్రత్త చర్యలపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. డేంజర్ జోన్ వద్ద రోబో యంత్రాల చేత సహాయక చర్యలు చేపట్టేందుకు అడ్డంకిగా ఉన్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపడు తున్నారు. టన్నెల్ ప్రమాద ప్రదేశంలోనీ డి-1, డి-2, ప్రదేశాలలో సహాయక బృందాలు కొనసాగిస్తున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్మీ అధికారులు, కల్నల్ పరీక్షిత్ మెహర, వికాస్ సింగ్, ఎన్డిఆర్‌ఎఫ్ అధికారులు డాక్టర్ హరీష్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్డిఆర్‌ఎఫ్ హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ర్యాట్ హోల్ మైనర్స్, అన్వి రోబోటిక్స్ , కేరళ రెస్క్యూ బృందం, జే పి, ప్రతినిధులు పాల్గొన్నారు.