calender_icon.png 26 February, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సి.యం.పి.ఎఫ్ ట్రైపర్ట్ ట్ సమస్యలపై సమీక్ష సమావేశం..

18-02-2025 06:08:08 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని సింగరేణి మాజీ ఉద్యోగుల పెన్షన్, సి.యం.పి.ఎఫ్ సమస్యల పరిష్కారం కొరకు స్థానిక వై.సి.ఒ.ఎ. క్లబ్ లో యం.వీ.టి.సి ఆధ్వర్యంలో జియం వి.కృష్ణయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సి.యం.పి.ఎఫ్, త్రిపార్టైట్ కోఆర్డినేషన్ కమిటీ కార్యక్రమము మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు కొత్తగూడెం రీజినల్ కమీషనర్ సి.యం.పి.యఫ్. యం.కనకమ్మ హాజరైయ్యారు. మాజీ ఉద్యోగులు యూనియన్ ప్రతినిధులు ఈ కార్యక్రమమునకు హాజరై తమ యొక్క పెన్షన్, సి.యం.పి.ఎఫ్ సంబందిత సమస్యలను పరిష్కరించుటకు కమీషనర్ కు విన్నవించుకున్నారు.

ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ... ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమము నిర్వహిస్తామని, పెన్షన్, సి.యం.పి.ఎఫ్ సమస్యలు తమ యొక్క దృష్టికి వచ్చేయని వాటిని సకాలంలో నివృత్తి చేస్తామని అన్నారు. అలాగే ఉద్యోగులకు సమస్యలు ఉన్నట్లయితే నేరుగా సి.యం.పి.ఎఫ్ కార్యాలయంలో సంప్రదించవలసినదిగా తెలిపారు. ఈ కార్యక్రమమునకు ఎస్ఓటు జీఎం రామస్వామి, సి.యం.పి.ఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ పిల్లి చిరంజీవి, డి.జి.యం (పర్సనల్) జి.వి.మోహన్ రావు, డిజిఎం సివిల్ రవికుమార్, ఫైనాన్స్ మేనేజర్ కె.మధుబాబు, యం. వి.టి.సి. మేనేజర్ మహేశ్వర్, సి.యం.ఓ.ఏ జాయింట్ ట్రెజరర్ బి.నాగేశ్వరరావు, సీఎంపీఎఫ్ ఎన్ఫోరసెమెంట్ ఆఫీసర్ సులోచన, సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ నజీర్ అహ్మద్, ప్రాతినిధ్య సంఘం నుంచి జి యాదగిరి, ఉన్నత అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.