calender_icon.png 26 April, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రైబల్ మ్యూజియం ప్రాచుర్యానికి రెవెన్యూ కృషి చేయాలి

25-04-2025 10:27:19 PM

ఏపీవో డేవిడ్ రాజ్..

భద్రాచలం (విజయక్రాంతి): ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం ప్రారంభమైన నాటి నుండి రోజురోజుకీ సందర్శకుల తాకిడి పెరుగుతున్నదని, మ్యూజియంను మరింత ప్రాచుర్యంలోకి తేవడానికి రెవెన్యూ అధికారుల సహకారం తప్పని సరిగా ఉండాలని ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. శుక్రవారం ఐటిడిఏ మ్యూజియంకు సంబంధించిన స్టిక్కర్లను ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు  ఆర్డీవో ఛాంబర్ లో ఆర్డీవో దామోదర్ రావుతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సందర్శకులకు పర్యాటకులకు ఆకర్షించేలా ట్రైబల్ మ్యూజియంను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజు సందర్శకులు వారి కుటుంబాలతో వచ్చి ట్రైబల్ మ్యూజియంలోని కళాఖండాలను తిలకించి గిరిజన వంటకాలను ఆస్వాదిస్తున్నారన్నారు. మ్యూజియం ప్రాముఖ్యత ఖండాంతరాలకు తెలియజేయడానికి సంబంధిత రెవెన్యూ అధికారులు మీ ఆధీనంలో ఉన్న లాడ్జిలకు ఇతర కార్యాలయాలకు తెలియజేసి మ్యూజియం అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం తాసిల్దార్ అశోక్ కుమార్, జేడీఎం హరికృష్ణ, సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.