28-04-2025 10:20:14 AM
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి(Marredpally)లో సోమవారం భారీగా పోలీసులు మోహరించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల(Double bedroom houses)లో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూం(Double bedroom) ఇళ్లలో అక్రమంగా ఉంటున్నారనే సమాచారంతో సోదాలు చేపట్టారు. పోలీసుల సహకారంతో అక్రమంగా ఉంటున్న వారిని అధికారులు గుర్తిస్తున్నారు. రెండు పడక గదుల ఇళ్లలోకి వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. మారేడ్ పల్లిలో 300కు పైగా డబుల్ బెడ్ రూం 200కుపైగా భర్తీ అయ్యాయి. ఖాళీ ఇళ్లలో ఇటీవల అక్రమంగా చేరారనే ఆరోపణలున్నాయి.