calender_icon.png 6 April, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కట్టడం కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

05-04-2025 06:58:49 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని భూదాకలన్ గ్రామపంచాయతీ శివారులో గల 170 సర్వే నెంబర్ లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని శనివారం రెవెన్యూ అధికారుల ఆదేశాలతో సిబ్బంది కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు కొనసాగిస్తే వాటిని తొలగిస్తామని తహసిల్దార్ జోష్ణ తెలిపారు. బెల్లంపల్లి మండలంలో కొనసాగుతున్న అక్రమ కట్టడాలపై దృష్టి పెడుతున్నట్లు ఆమె చెప్పారు.