calender_icon.png 11 February, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక మాఫియాపై రెవెన్యూ అధికారులు దాడులు

11-02-2025 07:14:00 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల తహసిల్దార్ ముజాహిద్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహశీల్దార్ రామ్ నరేష్ ఆధ్వర్యంలో పినపాక పట్టి నగర్ గ్రామంలో ఇసుక మాఫియాపై రెవెన్యూ సిబ్బంది, పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి కిన్నెరసాని నదిలో ఇసుక తరలిస్తున్నారని పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లిన రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది 10 ట్రాక్టర్ లను పట్టుకున్నారు. అందులో 9 ట్రాక్టర్ల డ్రైవర్లు పరారు అయినట్లు డిటి రామ్ నరేష్ తెలిపారు.

ఒక ట్రాక్టర్ సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. వదిలేసి వెళ్లిన ట్రాక్టర్ నెంబర్లను గుర్తించామని వారిపై కేసులు నమోదు చేయడానికి తహశీల్దార్ కు వివరాల అందించామని తెలియజేశారు. ఈ సందర్భంగా డిటీ రామ్ నరేష్ మాట్లాడుతూ... ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్టు సమాచారంతో దాడి చేయడం జరిగిందని తెలిపారు. అక్రమ ఇసుక రవాణా ఎవరైనా చేస్తే సహించేది లేదని అన్నారు. వారితో పాటు పోలీస్,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమ ఇసుక సీజ్..

మండలంలోని పినపాక పట్టి నగర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 24 ట్రిప్పుల ఇసుకను మంగళవారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహారావు సిబ్బందితో కలిసి సీజ్ చేశారు.