calender_icon.png 4 February, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ మేళా

04-02-2025 01:08:49 AM

వనపర్తి, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి):   జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లింపులు, ఇతర సమస్యల పరిష్కారానికి  సోమ, గురువా రాల్లో రెవెన్యూ మేళా నిర్వహించనున్నట్లు  అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ సోమవారం ఒక ప్రకటనలో  తెలి పారు. ఈ రెవెన్యూ  మేళా ద్వారా ప్రజలకు అనేక రకాల సేవలు అందుబాటులో ఉంటా యని చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లింపులు, ఇతర సమస్యలకు పరిష్కారం పొందవచ్చని చెప్పారు.

ఈ మేళా ద్వారా ప్రజలు ఎవరైనా రివిజ న్ పిటిషన్స్ ఉంటే కూడా పరిష్కరించు కోవచ్చని చెప్పారు. సోమ గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇందుకోసం మున్సిపల్ కమిష నర్లు సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. 

ఈ అవకాశాన్ని ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ప్రా పర్టీ పేరు మార్పు గాని, మ్యూటేషన్ సేవలు గాని, ఇంటి నంబర్ కేటాయింపు లేదా మా ర్పు వంటి మొదలైన సేవలు పొంద వచ్చని విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.