కామారెడ్డిలో బాధ్యతలను చేపట్టిన అదనపు రెవిన్యూ కలెక్టర్ విక్టర్
కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లాలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తానని జిల్లా రెవిన్యూ అదనపల్లి విక్టర్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తన చాంబర్ లో బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రెవిన్యూ పరమైన అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి పూల బోకెను అందజేశారు. ధరణి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు.