calender_icon.png 26 November, 2024 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబడి కొంత పెరిగింది

26-11-2024 01:28:29 AM

రాష్ట్ర ఖజానాకు ఊరటనిచ్చిన అక్టోబర్

  1. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిరాశపర్చిన తొలి అర్థ భాగం
  2. ఒక్క నెలలోనే 8శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు 
  3. ఆదుకున్న అమ్మకపు పన్ను
  4. అక్టోబర్ -మార్చి కాలంలో ఆమ్దానీని పెంచడంపై ఫోకస్

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగవుతున్నట్టు కనిపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో  తొలిసారిగా అక్టోబర్‌లో ప్రభుత్వానికి వచ్చే సొంత రాబుడులు రూ.15 వేల కోట్ల మార్క్‌ను దాటాయని కాగ్ వెల్లడించింది.

ఈ ఏడాదికి సంబంధించి ఇప్ప టికే కాగ్ ఏప్రిల్-అక్టోబర్ నివేదికను విడుదల చేసింది. వాస్తవానికి మొదటి అర్థ సంవత్సరం (ఏప్రిల్-సెప్టెంబర్)లో ప్ర భుత్వానికి ఆశించిన ఆదాయం రాలేదు. బడ్జెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో రెండో అర్థ సంవత్సరం (అక్టోబర్-మార్చి)లో అ యినా రాబడిని పెంచుకోవాలని నిర్ణయించింది.

అనుక్నున్నట్లుగానే.. సెకండాఫ్‌లోని మొదటి నెల (అ క్టోబర్)లో రాబడిని సాధించినట్లు తెలుస్తోం ది. అక్టోబర్‌లో..  ఈ ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా సొంతరాబడులు రూ.15 వేల కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

50.39శాతానికి జీఎస్టీ వసూళ్లు.. 

సొంత రాబడులు పెరగడంలో మెజార్టీ వాటా జీఎస్టీదే అని చెప్పాలి. ఏప్రిల్-సెప్టెంబర్ నాటికి రూ.24732.12కోట్లు వసూలైతే.. ఒక్క అక్టోబర్‌లోనే రూ.4,794.02 వచ్చా యి. సెప్టెంబర్ నాటికి జీఎస్టీ వసూళ్లు బడ్జెట్ అంచనాల్లో 42.21శాతం ఉంటే.. అక్టోబర్ నాటికి 50.39శాతానికి చేరుకోవడం గమనార్హం. వసూళ్లు ఏకంగా 8 శాతానికి పైగా పెరగడం ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశం.

ఇదిలా ఉండగా.. ఏప్రిల్‌ెేఅక్టోబర్ మధ్య కాలంలో ట్యాక్స్ రెవెన్యూ ఒక నెల ఎక్కువ వస్తే.. మరొక నెల తక్కువ రావడం పరిపాటిగా మారింది. వాస్తవానికి జూన్‌లో ట్యాక్స్ వసూళ్లు రూ.12190.37 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత నెల అంతకు మించి వస్తాయని ప్రభుత్వం ఆశించింది. కానీ జులైలో దారుణంగా రూ.9965.89 కోట్లు మాత్రమే వచ్చాయి.

ఇలా ప్రతినెల రాష్ట్ర ఖజానా రాబడులు విషయంలో అదే ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఇదిలాఉండగా.. అక్టోబర్‌లో వచ్చిన ఆదాయమే.. ఈ ఏడు నెలల్లో టాప్‌లో నిలవడం గమనార్హం. ఆగస్టులో ట్యాక్స్ రెవెన్యూ అత్యధి కంగా రూ.13146.64 కోట్లు వచ్చాయి.

అక్టోబర్ ఆ మార్కును దాటి రూ.13229.57 కోట్లు రావడం ప్రభుత్వానికి ఊరటనిచ్చే విషయం. ఇదిలా ఉండగా.. సొంత రాబడులు పెరగడానికి మరొక కారణం అమ్మ కపు  పన్ను వసూళ్లు. ఇవి అక్టోబర్ నాటికి బడ్జెట్ అంచనాల్లో 55.59 శాతం వసూలయ్యాయి. అంటే ప్రభుత్వం అంచనాలను అందున్నట్లు కనిపిస్తోంది.

అక్టోబర్-మార్చి పైనే ఆశలు.. 

ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే సొంత రాబడులు గందరగోళంగా మా రాయి. ఒక నెల ఎక్కువ వస్తే.. తర్వాత నెల తక్కువగా వచ్చేది. ఇలా రావడం వల్ల.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం ముందే నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రణాళిక దెబ్బతింటుంది. ఏప్రిల్ మధ్య కాలంలో ఆశించిన మేరకు ఆదాయ రాక ప్రభుత్వం ఇలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది.

అయితే అక్టోబర్‌లో సెప్టెంబర్ కంటే ఆదాయం పెరిగింది. గత ఆరు నెలల మాదిరిగా కాకుండా నవంబర్‌లో ఎలాగైనా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే నవంబర్‌లో అక్టోబర్‌లో వచ్చిన రాబడి కంటే ఎక్కువ రాబట్టుకునేలా ముందుకు సాగినట్లు తెలుస్తోంది. గడచిన ఆరునెలలు కాకుండా, ఈ ఆర్థిక సంవత్సరంలో ముందున్న కాలంలో ఎలా ఆదాయాన్ని పెంచుకోవచ్చో అన్ని రకాలు సమాలోచనలు చేస్తోంది.

2024 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత రాబడులు(రూ.కోట్లలో)

నెల వచ్చిన ఆదాయం

ఏప్రిల్ 11818.88

మే 11,328.76

జూన్ 12,462.03

జులై 12,103.02

ఆగస్టు 13,905.91

సెప్టెంబర్ 13,835.81

అక్టోబర్ 15,390.04

మొత్తం 90,844.45


2024   

  



 

11818.88

11,328.76

12,462.03

12,103.02

13,905.91

13,835.81

15,390.04

90,844.45

2024-25 ఆర్థిక సంవత్సరంలో 

వచ్చిన ట్యాక్స్ రెనెన్యూ (రూ.కోట్లలో)

నెల వచ్చిన ఆదాయం

ఏప్రిల్ 11464.17

మే 10954.96

జూన్ 12190.37

జూలై 9965.89

ఆగస్టు 13146.64

సెప్టెంబర్ 11183.78

అక్టోబర్ 13229.57

మొత్తం 82,135.38