calender_icon.png 1 April, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ గార్డెన్, రెవెన్యూ క్లబ్ సీజ్

31-03-2025 12:00:00 AM

ఆస్తి పన్ను చెల్లించనందుకు సీజ్ చేసిన నగరపాలక సంస్థ అధికారులు

పన్నులు వసూలు చేస్తున్న అధికారిపై దురుసుగా ప్రవర్తించిన ఓ వ్యక్తి... 

వార్డు ఆఫీసర్ మోటారు సైకిల్‌పై దాడి చేసి ధ్వంసం

సపోర్టింగ్ స్టాఫ్ అధికారిపై దాడి చేసిన వ్యక్తి

టూ టౌన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు

కరీంనగర్, మార్చి 30 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ 2024- ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను గడువు ముగుస్తుండటంతో పన్నుల వసూల్లను ముమ్మరాం చేశా రు. ప్రాపర్టీ టాక్స్ టార్గెట్ ను పూర్తి చేసేందుకు సెలవు రోజులను రెక్క చేయకుండా ఆదివారం రోజు పన్నులను వసూళ్ళు చేశారు.

ఆస్తి పన్నుల వసూళ్లలో భాగంగా నగర వ్యాప్తంగా రెవెన్యూ  విభాగం అధికారులు, వార్డు ఆఫీసర్లు, సపోర్టింగ్ ఉద్యోగులు డివిజన్ల వారిగా పన్ను  బకాయి దారుల ఇండ్లను సందర్శించి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉన్న బకాయిలను వసూళ్ళు చేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించ కుండ ఆస్తి పన్నులు కట్టని పలు ప్రాపర్టీలను సీజ్ చేయడంతొ పాటు పలు గృహాలు నల్ల కలెక్షన్లను తొలగించారు.

నగరంలో కలెక్టరెట్ కార్యాలయం సమీపంలో గల రెవె న్యూ క్లబ్, రెవెన్యూ గార్డెన్ కు సంబంధించిన ఆస్తి పన్ను దాదాపు 87 లక్షలు చెల్లించాల్సి ఉండటంతొ గతంలోనే నగరపాలక సంస్థ  రెవెన్యూ విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన నోటీసుల గడువు ముగిసినప్పటికీ పన్ను చెల్లించక పోవడంతో సంబంధిత రెవెన్యూ క్లబ్, గార్డెన్ ప్రాపర్టీలకు ఆర్వో భూమానంధం ఆద్వర్యంలో తాళం వేసి సీజ్ చేశారు.

అంతే కాకుండా నగరంలో  ఆస్తీ పన్నులు చెల్లించని పలు నివాస గృహాలకు సంబంధించిన నల్లా కలెక్షన్లను కూడ తొల గించారు. మరో వేపు 34 వ డివిజన్ గోదాంగడ్డ ఏరియా హనుమాన్ దేవాలయం సమీపంలో బకాయి ఆస్తి పన్ను చెల్లించాలని అడిగిన వార్డు అధికారిని, సపోర్టింగ్ ఉద్యోగి పై ఆంథోని అనే వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు.

టాక్స్ చెల్లించనంటు సదరు ఉద్యోగులపై దుర్బాషలాడుతూ... సపోర్టింగ్ ఉద్యోగి పై దాడి చేసి  అతని మోటార్ బైక్ ను ద్వంసం చేశాడు. దీంతో నగరపాలక సంస్థ తోటి రెవెన్యూ ఉద్యో గులు విషయం తెలుసుకొని అక్కడి హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని నగరపాలక సంస్థ కమీషనర్‌కు తెలియజేసి....దాడి చేసిన వ్యక్తి పై టూ టౌన్ పోలీస్టేషన్ ఫిర్యాదు చేశారు. 

ఈ సంధర్బంగా కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.... నగరపాలక సంస్థ ఆస్తి పన్నులు వసూళ్ళు చేస్తూ విధులు నిర్వహిస్తున్న మా అధికారులు, సిబ్బంది పై దురుసుగా ప్రవర్తిస్తె సంబంధిత వ్యక్తుల పై చట్టం ప్రకారం కఠిణ చర్యలు తీస్కుంటామన్నారు. అలాంటి వారికి పోలీసు కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు.

బకాయి దారులు గడువు లోగా మీ యొక్క పన్నులను చెల్లించి నగరపాలక సంస్థ కు సహాకరించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 90% వడ్డీ మాఫీని సద్వినియోగం చేస్కోని మీ యొక్క ఆస్తి పన్నులను చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వో, ఆర్‌ఐలు, వార్డు ఆఫీసర్లు, సపోర్టింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.