కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో రేషన్ బియ్యం పట్టుకున్న అధికారులు...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధి దేవునిపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఉదయం రెండు గంటల సమయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా డీసీఎంలో నిలువ ఉన్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు రెవెన్యూ డిటి కిష్టయ్య తెలిపారు. మెదక్ జిల్లా రామచంద్రపురం యూనిట్ విజిలెన్స్ అధికారులు, డిటి సివిల్ సప్లై కామారెడ్డి అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో 277 బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా 162 క్వింటాళ్లు ఉంచారని సమాచారం మేరకు దేవునిపల్లి సాయి శ్రీ శ్రీనివాస ట్రేడింగ్ మిల్లు నందు పిడిఎస్ బియ్యంతో ఉన్న డిసిఎం వ్యానును పట్టుకోవడం జరిగిందన్నారు. దీనిలో లవుడియా ధరావత్ సురేష్ డీసీఎం నందు 277 బస్తాల పిడిఎస్ బియ్యం సుమారు 162 క్వింటాళ్ల దాన్ని అక్రమంగా తీసుకొని వచ్చి అమ్ముతున్నారని సమాచారం మేరకు రైడ్ చేసి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. దీని నిమిత్తమై డిటి సివిల్ సప్లై కిష్టయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. రేషన్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై పేర్కొన్నారు.