21-03-2025 05:03:57 PM
చిట్యాల,(విజయక్రాంతి): ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండే విధంగా చిట్యాల మండల కేంద్రంలో సబ్ డివిజనల్ కార్యాలయం(Sub-Divisional Office) ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలని భూపాలపల్లి జిల్లా టిడిపి అడహక్ కమిటీ సభ్యుడు కోడెల భద్రయ్య కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో పునర్విజన చట్టం(Rebirth Act) ప్రకారం జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత భూపాలపల్లిలో సబ్ డివిజనల్ కార్యాలయాలను ఏర్పాటు చేయలేదన్నారు. డి.ఎస్.పి,ఆర్డీవో, మున్సిఫ్ కోర్టు తో పాటు వివిధ శాఖలకు చెందిన సబ్ డివిజనల్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన వసతులకు, సౌలభ్యం కొరకు ప్రభుత్వం దృష్టి సారించి కార్యాలయాలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలి.
గతంలో ఉ మ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ప్పుడు చిట్యాల తాలూకా కేంద్రంగా ఉండి ప్రభుత్వ కా ర్యాలయాల పాలన జరిగేది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చిట్యాల మండల కేంద్రం లో సబ్ కోర్టు ఆర్డిఓ పోలీస్ సబ్ డివిజనల్ తో పాటు వివిధ ప్రభుత్వ శా ఖల సబ్ డివిజనల్ కార్యాలయాన్ని ఏ ర్పాటు చేయాలి.మండల కేంద్రం శివారులోని రామచంద్ర పురంలో భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆనువైన స్థలం ఉందనీ,చిట్యాలని కేంద్రంగా చేసుకొని మొగుళ్ళపల్లి, టేకుమట్ల, రేగొండ మండలాలు అతి సమీపంలో ఉండడంతో పరిపాలనకు అనువుగా ఉంటుందనీ.చిట్యాల మండల కేం ద్రంలో ప్రభుత్వ కార్యాలయా లను ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చొరవ తీసు కొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు దూడపాక సాంబయ్య, కొత్తూరి జయ పాల్, గుమ్మడి శంకర్రావు, సామల సాంబయ్య, కుర్ర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.