calender_icon.png 22 January, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ శాఖకు మరింత గుర్తింపు తేవాలి

05-07-2024 12:29:02 AM

తహసీల్దార్ల సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): రెవెన్యూ శాఖకు మరింత గుర్తిం పు తెచ్చేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మండలాల వారీగా తహసీల్దార్ కార్యాలయాల పనితీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రజల నుంచి వచ్చే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్వీకరించి పరిష్కారమైన తేదీలను రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. జూన్ 4 నుంచి జూలై 4 వరకు కులం, ఆదాయం, ఇతర ధృవీకరణ పత్రాల కోసం మీ సేవ ద్వారా 14,195 దరఖాస్తులు రాగా, 8111 దరఖాస్తులను పరిష్కారమయ్యాయని, నాయబ్ తహసీల్దార్లకు 19,299 అర్జీ లు రాగా 16,665 సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. . 

ప్రభుత్వ భూముల రక్షణకు ‘ల్యాండ్ బ్యాంక్ యాప్’..

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఆ భూముల రక్షణ కోసం ల్యాండ్ బ్యాంక్ యాప్‌ను రూపొందించాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో ఏ ప్రాంతంలో ఎంత ప్రభుత్వ భూమి ఉందనే వివరాలను ల్యాండ్ బ్యాంక్ రిజిస్టర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా ప్రతిరోజు వర్షపాతం వివరాలను నమోదు చేయాలన్నారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కదిరవన్, డీఆర్వో వెంకటాచారి, ఆర్డీవోలు మహిపాల్, దశరథ్‌సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.