calender_icon.png 11 January, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో రేవతి

11-01-2025 12:00:00 AM

న్యూఢిల్లీ: ఐటీఎఫ్ 300 ఈవెంట్‌లో బాలికల విభాగంలో భారత్‌కు చెందిన రేవతి రాజేశ్వరన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సూపర్ ఫామ్‌లో ఉన్న రేవతి రాజేశ్వరన్ శుక్రవారం జరిగిన సెమీస్‌లో 6-4, 6-7 (4/7), 6-2 తో ఫ్రాన్స్‌కు చెందిన ఎలీజాను ఓడించింది. టైటిల్ పోరులో రేవతి రష్యాకు చెందిన ఎకాటెరినాను ఎదుర్కోనుంది. 2023 డిసెం బర్‌లో పుణే వేదికగా జరిగిన ఐటీఎఫ్ జె---100 టోర్నీలో రేవతి రాజేశ్వరన్ విజేతగా నిలిచింది. ఇక బాలుర విభాగంలో సెంథిల్ కుమార్ సెమీస్‌కు పరిమితమయ్యాడు.