11-04-2025 01:36:45 AM
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): అహ్మదాబాద్‌లో బీజేపీ పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య లు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడు తూ.. రేవంత్ వాక్చాతుర్యం కాంగ్రెస్ పతనాన్ని అడ్డుకోలేదని దుయ్యబట్టారు.
బీజేపీని విమర్శించ డానికి ముందు రేవంత్ కామారెడ్డిలో తమ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి మర్చిపోయినట్లున్నారని ఎద్దేవాచేశా రు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకున్నట్టు తెలిపారు. 2024లో రేవంత్ ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి సహా 8 ఎంపీ సీట్లు గెల్చుకున్నామని సుభాష్ అన్నారు. ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోను గెలుపు అందుకున్నట్టు గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మునిగిపోతుంటే బీజేపీ పుంజుకుంటోందని, వచ్చే ఎన్నికల్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.