calender_icon.png 23 November, 2024 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ పతనం మానుకోట నుంచే ప్రారంభం

23-11-2024 01:26:58 AM

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ 

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): మానుకోట నుంచే సీఎం రేవంత్‌రెడ్డి పతనం మొదలైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అ న్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితోనే మహబూబాబాద్‌లో మహా ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. మహాధర్నాకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టులాంటిదన్నారు.

తెలంగాణ భవన్‌లో శుక్ర వారం మీడియా సమావేశంలో ఎ మ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ కవితతో కలిసి ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీ రాజ్యాగాన్ని పట్టుకొని పార్లమెంట్‌లో ప్ర మాణ స్వీకారం చేస్తారని, కానీ రేవంత్‌రెడ్డి అదే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తు న్నారని విమర్శించారు.

లగచర్ల రైతులనే మెప్పించని వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా మెప్పిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా లగచర్లలో ఫార్మా విలేజ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈనె 25న మహబూబాబాద్‌లో గిరిజన, దళిత రైతులతో మహాధర్నా చేప ట్టి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామ న్నారు.

అనంతరం ఎమ్మెల్సీ రవీందర్ రావు ప్రసంగిస్తూ గతంలో రేవంత్‌రెడ్డి ప్రైవేట్ కంపెనీలు, తమ కుటుంబసభ్యుల కంపెనీల కోసం భూములు బలవంతంగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. తన ఇంటి దగ్గర ఇనుపకంచెలు వేసుకొని పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు.