15-02-2025 01:57:47 AM
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు అవగాహనరాహిత్యానికి నిదర్శనం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విషయాన్ని మరిచి పోయి నోటికొచ్చినట్లు మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. ప్రధాని బీసీనా కాదా అనే అంశంపై ముఖ్యమంత్రి బహిరంగచర్చకు రావాలి. రోజురోజుకూ రాష్ర్టంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పట్టుకో ల్పోతున్న నేపథ్యంలో..
అసహనంతో రేవంత్‌రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు. ఆకాశంపైకి ఉమ్మేస్తే పెద్దోడిని అయిపోతానని రేవంత్‌రెడ్డి అనుకుంటే అది ఆయనపైనే పడుతుం దనే విషయం గుర్తుపెట్టుకోవాలి. స్వతహాగా బీసీవర్గానికి చెందిన వ్యక్తిగా దేశంలో బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రధాని మోదీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది.
సామాజిక సామరస్యత విషయంలో బీజేపీకి, మోదీ కి.. రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. బీసీ కమిషన్‌కు రాజ్యాం గ హోదా కల్పించిందే మోదీ ప్రభుత్వం. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. రాష్ర్టమంతా అట్టహాసంగా సర్వే నిర్వహించి తమకు అన్యాయం చేశారని బీసీ సంఘాలే విమర్శలు చేస్తున్నాయి.
అసమగ్రంగా సర్వే చేశారంటూ మండిపడుతు న్నాయి. దీన్నుం చి తప్పించుకునేందుకే విమర్శలు చేస్తున్నారు. 75 ఏళ్లలో ఒక్క బీసీనైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసిందా? తెలంగాణలో అధికారంలోకి వస్తే.. బీసీని సీఎంను చేస్తామని ప్రకటించిన పార్టీ బీజేపీ.
కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి