మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): సర్కారుకు ముందు చూపులేదని.. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా పథకం ప్రకారం రైతులు దళారులను ఆశ్రయించేలా కుట్రలు చేసిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. పత్తి మద్దతు ధర రూ.7,521 ఉంటే.. రైతు లు రూ.5 వేలకే అమ్ముకున్నారని, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు సభతో ప్రజలకు, రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. అభివృద్ధికి అడ్డుపడితే తొక్కుకుంటూ పోతా అని సీఎం అంటున్నాడు.. నిధులివ్వమం టే మంత్రులను, భూములివ్వని రైతులను, హామీలు అమలు చేయాలని అడిగే ప్రజలను తొక్కుకుంటూ పోతా వా? అంటూ ప్రశ్నించారు.
జిల్లాలో వలసలను ఆపి పాలమూరును పచ్చగా చేసిందే బీఆర్‌ఎస్ అని అన్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం 130 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద సాగు పరిస్థితి ఏమిటిని ప్రశ్నించారు. యాసంగి పంటలు వేయాలా? వద్దా? అని రైతులకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.