calender_icon.png 2 January, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ దార్శనికత భేష్

31-12-2024 02:07:35 AM

నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులతోనే ఆర్థికాభివృద్ధి 

  1. అన్నికార్యక్రమాల్లో ప్రభుత్వ భాగస్వామిగా ఉంటాం: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 
  2. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో బృందం భేటీ

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సీఈవో, చైర్మన్ సత్య నాదెళ్ల తెలిపారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది.

ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారు. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలవని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సత్య నాదెళ్లకు తెలిపారు. రాష్ర్టంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డాటా సెంటర్‌లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిందని, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు సత్య నాదెళ్లకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్‌ను టెక్నాల జీ డొమైన్‌లో ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపేందుకు రాష్ర్ట ప్రభుత్వం దృష్టిసారిస్తున్న ఏఐ, జెన్ ఏఐ, క్లౌడ్‌తో సహా వివి ధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సత్య నాదెళ్లకు విజ్ఞప్తి చేశారు.

రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, రాష్ర్టంలో మౌలిక వసతులు కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటు లో ఉంచేందుకు తాము చేస్తున్న కృషి ని సత్య నాదెళ్లకు సీఎం వివరించారు.

సమావేశంలో రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రా ష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రం జన్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.