21-02-2025 12:54:00 AM
నారాయణపేట, ఫిబ్రవరి 20(విజయక్రాంతి): సిఎం రాక సంధర్బంగా ఏర్పాట్లు చేస్తున్న సభాస్థలిని జిల్లాలోనీ ఎమ్మెల్యేలు, చిట్టెం పర్నీకరెడ్డి, శ్రీహరి, వీర్లపల్లి శంకర్, వంశీ కృష్ణ లు పనులను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కేంద్రంలో 1000కొట్ల రూపాయల తో చేపడుతున్న అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేస్తారని, అన్నారు.అలాగే సిఎం బహిరంగ సభను విజయవంతం చేయాలనీ కోరారు.
ముఖ్యం గా జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల,నర్సింగ్ కళాశాలతో పాటు మహిళా సమాఖ్య ద్వారా నడిచే పెట్రోల్ బంక్ ను ప్రారంభిస్తారని అన్నారు. దీంతో పాటు నారాయణపేట జిల్లా కు ఆణిముత్యమైన పేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ను కూడా ప్రారంభిస్తారని అన్నారు. ఒకప్పుడు నారాయణపేట జిల్లా అంటే వలసలకు పేరుగాంచినదిగా ఉండే జిల్లా ప్రస్తుతం వలసలు వచ్చె జిల్లాగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన అధికారులు
నారాయణపేట. ఫిబ్రవరి 20(విజయక్రాంతి): రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నారాయణపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసేందుకు వస్తున్న సందర్భంగా గురువారం రాష్ర్ట హెల్త్ డైరెక్టర్ క్రిస్టినా, ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఐ అండ్ పి ఆర్ కమిషనర్ హరీష్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సింగారం చౌరస్తాలోని హెలిప్యాడ్ స్థలాన్ని, సమీపంలోనే గల నూతన పెట్రోల్ బంక్, వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని అధికారుల బృందం పరిశీలించారు. అనంతరం మండలంలోని అప్పక్ పల్లి వద్ద సీఎం భూమి పూజ చేసే ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని పరిశీలించి ఆ తర్వాత మెడికల్ కళాశాలకు చేరుకొని అక్కడ సీఎం చేతుల మీదుగా జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వివరాలను తెలుసుకున్న అధికారులు వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా సీఎం కార్యక్రమ ఏర్పాట్లు చేయాలని స్టేట్ హెల్త్ డైరెక్టర్ క్రిస్టినా అక్కడి అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాల వద్ద జరిగే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల పై చర్చించారు. చివరగా సీఎం పాల్గొనే బహిరంగ సభ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను వారు పర్యవేక్షించారు. వేదిక పక్కన గ్రీన్ రూమ, వేదికపై సీటింగ్ కెప్యాసిటి, వీఐపీల గ్యాలరీ తదితర వాటిపై చర్చించారు. అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎమ్ ఐ డి సి సి. ఈ దేవేందర్, ఎస్ ఈ సురేందర్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రామ్ కిషన్, ఆర్ అండ్ బి ఎస్. ఈ, వనజా రెడ్డి, ఈ ఈ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.