calender_icon.png 19 January, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణలు చెప్పాలి

12-07-2024 01:50:52 AM

  1. ఉద్యోగాలు అడిగితే అరెస్టు చేస్తారా?
  2. కొందరి పోలీసుల అత్యుత్సాహం సరికాదు
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): విద్యార్థులను, నిరుద్యోగులను అవమానించేలా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి క్షమా పణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసికేటీఆర డిమాండ్ చేశారు. విద్యార్థులను అధికారం కోసం వాడుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సన్నాసా, రేవంత్‌రెడ్డి సన్నాసో చెప్పాలని నిప్పులు చెరిగారు.  మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి కేవలం 6 వేల అదనపు పోస్టులతో విద్యార్థులు, నిరుద్యోగులను దగా చేస్తున్నారని విమర్శించారు.

బుధవారం బీఆర్‌ఎస్వీ విద్యార్థి నాయకుల సమావేశంలో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కూడా భరించలేని నిరంకుశ మనస్తత్వం కలిగిన సీఎం రేవంత్‌రెడ్డి, తమ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపై పోలీసు దాడులు చేస్తూ దుర్మార్గం గా వ్యవహరిస్తున్నాడని, రాహుల్‌గాంధీతో సహా నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుందన్నారు. జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి మీడియాలో పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇచ్చారని, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీని నిరుద్యోగులు అడుగుతుంటే అరెస్టులు చేయిస్తుందని మండిపడ్డారు. ఇదేం న్యాయమని అడిగిన వారందరిపై కేసులు నమోదవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పోలీసులు విద్యార్థులపై చేస్తున్న దాడులను విద్యార్థి నాయకులు తమ డైరీలో నమోదు చేసుకుంటున్నారని, తాము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టే ప్రసక్తిలేదన్నారు.  

పోలీసుల అత్యుత్సాహం పనికిరాదు

అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీ సులను అదుపుచేయాలని డీజీపీకి  కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా పోలీసులు వృత్తిపట్ల వ్యవహరించే ప్రొఫెషనలి జం తీరుకు మంచి పేరు ఉండేదని, అది పోకుండా కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వం పెద్దలను సంతృప్తి పరిచేందుకు కొంతమంది తీరు పోలీసుల పేరును చెడగొతుందన్నారు. తొర్రూర్ నియోజకవర్గంలో మాలోతు సురేశ్‌బాబు అనే గిరిజన యువకుడిని అరెస్టు చేసి క్రూరంగా హింసించారని మండిపడ్డా రు. స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వాట్సాప్‌లో పోస్టుచేయడమే ఆయన చేసిన నేరమా? అంటూ నిలదీశారు. 

అదానీ సంస్థపై ద్వంద్వ వైఖరి 

అదానీ విద్యుత్ సంస్థల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అవకాశవాద ద్వంద్వ వైఖరిపై రాహుల్‌గాంధీకి కేటీఆర్ మరోసారి చురకంటించారు. అదానీ విద్యుత్‌పై కాంగ్రెస్ వైఖరి అర్థం చేసుకోవడం కష్టమని, ఆ సంస్థకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు, మరోవైపు అదే అదానీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం స్వాగతం చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

మహానగరానికి ఏమైంది?

గురువారం ప్రముఖ పత్రికల్లో నగరానికి ఏమైంది అనే కథనం ప్రచురణ కావడంతో స్పందించిన కేటీఆర్ నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపించారు. పరిపాలనా అనుభవంలేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి గ్రామాల వరకు కనిపిస్తోందన్నారు. బ్రాండ్ హైదరాబాద్ ఎందు కు మసకబారుతోందని, విశ్వనగరం ఎందుకు కళ కోల్పోతుందని సగటు హైదరాబాదీకి అనిపిస్తుందన్నారు.