calender_icon.png 1 April, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల నిర్వహణలో రేవంత్ సర్కార్ విఫలం

30-03-2025 12:51:21 AM

ఎమ్మెల్యే హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): గురు కులాల నిర్వహణలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే హరీశ్ రావు విమర్శించారు. చిన్న జ్వరానికే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం శోచనీ యమన్నారు. గురుకులాల నిర్వహణ వైఫల్యం బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.

నల్లవాడు సాంఘి క సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి నిఖిల్ మరణం బాధాకరమన్నారు. ఈ కష్టసమ యంలో నిఖిల్ కుటుంబ స భ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తు స్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

ఒక గురుకులంలో 400 మంది విద్యార్థులనే సమర్థవంతంగా చూసుకోలేని ప్రభుత్వం.. రెండువేల మంది ఉండే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్వహణను ఎలా చేయగలదని ప్రశ్నించారు. మృతి చెందిన నిఖిల్ కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.