25-02-2025 02:03:05 AM
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ
కామారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి), రేవంత్ రెడ్డి అనుభవం లేని పాలన సాగిస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కు ప్పగా మార్చారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. సోమవారం కామారెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశ అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలోనే భారతదేశానికి గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మోడీ కే దక్కుతుందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బిజెపి బలపరిచిన పట్టబద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టభద్రులు అంజిరెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు లలో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు బకాయి పడ్డ ఐదు డిఏలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఎస్ ఎల్ బి సి లో చిక్కుకున్న ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకం లో విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని త్వరలో జరిగే ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని అన్నారు. అనంతరం బార్ ఆసో సియేషన్ కు వెళ్లి న్యాయవాదులను కలిసి ఓట్లను అభ్యర్థించారు.
అనంతరం జిల్లా గ్రంథాలయం భవనంలో పట్టబద్రులను కలిసి బిజెపి అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం లింగంపేట్ ఎల్లారెడ్డి మండల కేంద్రాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, బిజెపి జిల్లా మాజీ అధ్యక్షురాలు అరుణతార, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ పాల్గొన్నారు.