calender_icon.png 13 January, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీలను మోసం చేసిన రేవంత్ రెడ్డి

12-01-2025 10:18:03 PM

మైనార్టీ డిక్లరేషన్ ఏమైంది...?

విరుచుకుపడిన ఎమ్మెల్సీ కవిత...

నిజామాబాద్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్ గారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను మోసం చేసిందని మైనార్టీల పట్ల కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నరని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని ఆర్ఎస్ఎస్ దిశా నిర్దేశంలోనే ఆయన పనిచేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ డిక్లరేషన్ ఏమైందని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆదివారం నాడు ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగాపెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో జరగనున్న తబ్లికి జమాత్ కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి వివక్షత చూపిస్తున్నారన్న అనుమానం ఆమె వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైనార్టీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసిందని, ఎంతో నమ్మకంతో మైనార్టీలు ఓట్లు వేసి కాంగ్రెస్ను గెలిపిస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేశారని ఆమె మండిపడ్డారు. 

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) హయాంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా మతకలోహాలు జరగలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలం లోపే ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అనేక మతకలహాలు జరిగాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మత కలహాలు నిరోధించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఆమె నిలదీశారు. గంగా జమున తహజీబ్లా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి ప్రజల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించడం శోచనీయమన్నారు. మైనార్టీ డిక్లరేషన్ ఏమైందని మైనార్టీల డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనార్టీలు కాంగ్రెస్కు ఓట్లు వేశారని కానీ మైనార్టీల నమ్మకన్ని వాము చేసి మైనార్టీలకు మొండి చేయి చూపిస్తున్నారని కవిత విరుచుకుపడ్డారు. 

మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్లో కనీసం 25% కూడా ఖర్చు చేయలేదని ఆమె ఆరోపించారు. మైనార్టీలకై మూడు వేల కోట్లు కేటాయించిన రేవంత్ రెడ్డి సర్కారు కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని షాదీ ముబారక్ కింద ఒకటి పాయింట్ ఆరు లక్షలతో పాటు తులం బంగారం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మైనారిటీలకు ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. నిజామాబాద్ లో పబ్లిక్ జమాత్ కార్యక్రమానికై అన్ని ఏర్పాట్లు చేయాలని, జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కలెక్టర్ ని కోరారు. టిఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీనీ బలవంతంగా ప్రజలపై నెట్టారని షబ్బీర్ అలీ నిజామాబాద్ కు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ తీసుకురాలేదని ఈ సందర్భంగా ఆమె దుయ్యబట్టారు.