calender_icon.png 8 January, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ది చెప్పాలి

06-01-2025 01:51:19 PM

మాజీ జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య 

జడ్చర్లలో బీఆర్ఎస్ నిరసన దీక్ష... 

జడ్చర్ల: రైతు భరోసా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రైతులను నట్టేట మోసం చేశారని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య ఆరోపించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ మోసం చేసిందని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సోమవారం జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య మాట్లాడుతూ.. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చాక వాటిని పక్కన పెట్టిందన్నారు. రైతులకు ఎకరానికి రూ. 15వేలు రైతు భరోసా కింద ఇస్తామని రైతు డిక్లరేషన్ లో పెట్టి, ఇప్పుడు రూ. 12వేలు ఇస్తామంటూ  సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని మండిపడ్డారు.

రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు పలువురు బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల మోసాలను వివరించారు. రైతన్నలను మోసం చేసిన పార్టీలకు పుట్టగతులు ఉండవని చెప్పారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు సుదర్శన్ గౌడ్, రఘుపతి రెడ్డి, ప్రణీల్ చందర్, శ్రీశైలం యాదవ్, ఇంతియాజ్, శ్రీకాంత్, నాగిరెడ్డి, శంకర్ నాయక్, మతిన్, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, వివిధ మండలాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.