calender_icon.png 5 January, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దావోస్ పర్యటనకు రేవంత్‌రెడ్డి బృందం

01-01-2025 12:52:58 AM

  1. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పర్యటన 
  2. జనవరి 2౦న వెళ్లేందుకు అవకాశం

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృం  జనవరి 20న దావోస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్శదర్శితోపాటు పరిశ్రమల శాఖ అధికారులు ఉండనున్నారు.

గత ఏడాదిలో దావోస్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల వరకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. 

నూతన సంవత్సర వేడుకలకు సీఎం దూరం

నూతన సంవత్సర వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు దూరంగా ఉండనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణం నేపథ్యంలో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

మన్మోహన్ మృతికి వారం రోజులు సంతాప దినాలను రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు పూలబొకేలు, శాలువాలు, స్వీట్స్  తీసుకురావద్దని పార్టీ శ్రేణులకు సీఎంవో నుంచి ఆదేశాలు జారీఅయ్యాయి.