calender_icon.png 13 November, 2024 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీ గౌరవం కాపాడాలి

19-09-2024 12:00:00 AM

బీఆర్‌ఎస్ నేత రాకేశ్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీ గౌరవం కాపాడటం లేదని, బజారు భాష మాట్లాడుతూ ప్రజల్లో పరువు తీసుకుంటున్నారని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాట్లాడేముందు ఇంజురిస్ టు హెల్త్ అని చెప్పి మాట్లాడాలని కోరారు. ప్రధానిగా చాలా మంది పనిచేశారని, దేశంలో గాంధీలు తప్ప మరెవరూ లేరా? రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు ఎందుకు పెట్టారని మండిపడ్డారు.

టీడీపీలో ఉన్నప్పుడు కంప్యూటర్‌ను పుట్టించింది చంద్రబాబు నాయుడేనని, ఇప్పుడు రాజీవ్‌గాంధీ అనడం హస్యాస్పదంగా ఉ ందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి అయితే బలి దేవత ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇడ్లి వడ అమ్ముకోవాలంటూ మాట్లాడి చిరు వ్యాపారులను సీఎం అవమానించారని, ఆయన ఫామ్‌హౌజ్‌ల్లో ఎంజాయ్ చేస్తే, కేసీఆర్ వ్యవసాయం చేసి పంటలు తీస్తున్నాడని పేర్కొన్నారు. దేశంలో గాంధీ పేర్లతో ఉన్న విద్యాలయాలు, ఎయిర్‌పోర్టులు, ప్రభుత్వం పథకాలు, స్టేడియాలు, పవర ప్లాంట్లు, అవార్డులు, స్కాలర్‌షిప్‌లు, ఆసుపత్రులు, ఓడరేవులు, ఉద్యానవనాలు, మ్యూజియాలు, ప్రభుత్వ ఆస్తులపై పేర్లు ఉన్నాయని వాటిపై పెద్ద పుస్తకం తయారు చేయవచ్చన్నారు.