calender_icon.png 31 October, 2024 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డి డ్రగ్స్ టెస్టుకు రావాలి

31-10-2024 01:43:52 AM

మాకు చెప్పకుండా ఆస్పత్రికి వెళ్తే ఎలా? : పాడి కౌశిక్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయ క్రాం తి): సీఎం రేవంత్ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసిడ్రగ్స్ టెస్టుకు రావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. తన పంచాయతీ అనిల్‌కుమార్‌తో కాదని, రేవంత్‌రెడ్డితోనేన ని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి డ్రగ్స్ టెస్టుకు రావాలని తాను సవాల్ విసిరానని, కానీ తనకు చెప్పకుండా వెళ్తే ఎలా? అని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేశారని, ఇప్పుడు కేటీఆర్ పై కూడా విఫలమయ్యారని విమర్శించారు.