మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు...
లక్షెట్టిపేట (విజయక్రాంతి): ఎన్నికల హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డీ(CM Revanth Reddy) ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి, ప్రజలందరికీ తక్షణమే క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హెచ్చరించారు. సోమవారం మున్సిపాలిటీలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ... ఎన్నికల కోసం అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతాంగానికి 8 వేల కోట్ల రూపాయలు ఖాతాలో జమ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కూడా ఒంటెద్దు పోగొడలను మానుకొని తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే రైతులకు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ రైతు బంధు కన్నా ఎక్కువ 7500 ఇస్తానని చెప్పి మరిచిపోయిన రేవంత్ రెడ్డి అని హెద్దేవా చేశారు. తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. నెరవేరని హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబాసు పాలు అయ్యిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతాయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పన లింగయ్య, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, ఏండీ చాంద్, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.