calender_icon.png 23 December, 2024 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులర్పించిన రేవంత్ రెడ్డి

23-12-2024 11:11:02 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ బిడ్డ, బహు భాషాకోవిదుడు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సరళీకృత ఆర్థిక విధానాలతో సంస్కరణలకు బీజం వేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిన దార్శనికుడని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్ లో పీవీ నరసింహారావు వర్ధంతి సంస్మరణ సభ వద్ద కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, కేశవరావు తదితరులు పుష్పాంజలి ఘట్టించారు.