calender_icon.png 16 March, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రజకులకు అండగా ఉంటుంది..

15-03-2025 10:54:48 PM

ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తాం..

రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి ప్రభుత్వం రజకులకు అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి బీసీల పక్షపాతి అని, ట్యాంక్ బండ్ పై వీరనారి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసి ఆమె పోరాటస్ఫూర్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజక ఫిషర్మెన్ సొసైటీల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ కుమార్ రజక అధ్యక్షతన రజకుల జన శంఖారావం రజకుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభకు రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, రజక ఫెడరేషన్ రాష్ట్ర సొసైటీల కమిటీ వ్యవస్థాపక చైర్మన్ అమన గంటి సైదులు రజక హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నాటినుండి నేటి వరకు శ్రమ చేసే యంత్రాలుగా పనిచేస్తూ అభివృద్ధికి నోచుకునే రజక కులాన్ని కొన్ని కులాల వారు అణిచివేస్తూ వారిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమదోపిడి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడితే మన కులానికి మనమే ద్రోహం చేసిన వాళ్లమవుతామన్నారు, మన కులాన్ని సగౌరవంగా చెప్పుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రజకులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి బీసీల పక్షపాత అన్నారు. ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటుచేసి ఆమె పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు.

కులాల యొక్క అసత్వాన్ని కాపాడడానికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని కుల గణన ద్వారా దాని నిరూపించారు అన్నారు. రజక ఫెడరేషన్ జన్మాతగా వచ్చిన హక్కని రజకులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రజక, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కోశాధికారి నేరెల కుమార్, రాష్ట్ర కార్యదర్శి రామస్వామి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి వడ్డబోయిన మంగ, మహిళా నాయకులు వి.సంధ్య తదితరులు పాల్గొన్నారు.