calender_icon.png 6 March, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలతో రేవంత్ రెడ్డి సర్కారు ఆటలాడుతోంది

06-03-2025 01:21:02 AM

కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

కొత్తగూడెం, మార్చి 5 (విజయ క్రాంతి): రేవంత్ రెడ్డి సర్కారు మహిళలతో ఆటలాడుతోందని, మహిళలను మభ్యపెట్టి మోసం చేస్తోందని, పూటకో మాట.. గంటకో మంత్రి ప్రకటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోన్నదని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీత లక్ష్మి ధ్వజమెత్తారు. మోసపూరిత హామీలతో మహిళలకు ఆశచూపి కాంగ్రెస్ అందలమెక్కిందని, మహిళా దినోత్సవం నాడు మహిళలకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమె  డిమాండ్ చేశారు.

బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బిఆర్‌ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు బుధవారం బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మహిళలతో కలిసి కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్  విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8లోగా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయంతో పాటు 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం వంటి హామీలపై కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి తెచ్చేందుకు జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ   కల్వకుంట్ల కవిత ‘పోస్టు కార్డు ఉద్యమాన్ని’ ప్రారంభించారని, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 10,000 పోస్టు కార్డులను సోనియా గాంధీ కి పంపించనున్నారని , ఇదే రీతిలో భద్రాద్రి కొత్తగూడెంలోని మహిళా లోకాన్ని ఏకం చేసి సోనియా గాంధీకి పోస్టుకార్డులు పంపిస్తామని హెచ్చరించారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు నేడు అమలు చేస్తున్న పథకాలకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు..? అని అన్నారు.

18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేశారని, వడ్డీ లేని రుణాలపై ప్రభుత్వం అందంగా అబద్ధాలు చెబుతోందని, మహిళలతో రేవంత్ రెడ్డి సర్కారు ఆటలాడుతోందన్నారు. 

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తొగరు రాజశేఖర్, హుస్సేన్, జయరాం, సరేందర్, ఖాజాభక్ష్, షరీఫ్, లావుడ్యా సత్యనారాయణ, జి.శ్రీనివాస్, షమ్మీ, మాజీ కౌన్సిలర్ వేముల ప్రసాద్, మద్దెల సుధీర్,మధు,సురేందర్,శ్రీను రాజారాణి, భారతి, రాజమ్మ, రాణి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు