calender_icon.png 17 January, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్

17-01-2025 12:05:06 AM

కరీంనగర్, జనవరి16 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తుగ్లక్ పాలనతో బిఆర్‌ఎస్ నేతలను, 60 లక్షల మంది కార్యకర్తలను ఇబ్బంది పెడుతు న్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హా మీలు ఏమైనాయని అడిగితే కేసులు పెడు తున్నారని అన్నారు.

కేసిఆర్ హయాంలో ఇచ్చిన రైతు బంధు, కెసిఆర్ కిట్ ఏమైందని అడిగితే కేసులు పెడుతున్నారా? అని ప్రశిం చారు. మిగతావారికి తినిపించాలనే లక్ష్యం గా పెట్టుకున్నాడన్నారు.  ఈ ఫార్ములా చెల్లిం పులు అక్రమం అయితే అధికారంలోకి వచ్చి న వెంటనే ఎందుకు బయటపెట్టలేద న్నారు. పిచ్చి ఆలోచనలతో పాగల్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. ముందే గ్రహించి కేసిఆర్ 60 లక్షల మంది సైన్యాన్ని తయారు చేశార ని అన్నారు. 

బిఆర్‌ఎస్ బట్టలు విప్పు తా అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రెచ్చగొట్టడంతో నీది ఏ పార్టీ అని అడిగానని అన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళితే నిలదీయండి రాళ్ళతో కొట్టండని రేవంత్ రెడ్డే నేర్పించారని, ఆయన చెప్పినట్లు రాళ్ళతో కొట్టకుండా ప్రశ్నిస్తే..ఎమ్మెల్యే లు సంజయ్‌తో పాటు కవ్వంపల్లి సత్యనారాయ ణ, రాజ్ ఠాకూర్ దాడి చేశారన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివా స్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బెదిరించార న్నారు.

వాళ్లపై ఫిర్యాదు చేస్తే తన పిర్యాదు ను పట్టించుకోవడం లేదన్నారు. ఆర్డీవోను ఏమి అనక పోయినా ఆయనతో కేసు పెట్టిం చారని అన్నారు. ప్రజలకోసం పోరాడితే 28 కేసులు పెట్టారని, తనపై పీడీ యాక్ట్ అమలు చేస్తారట? ఫస్ట్ రేవంత్ రెడ్డిపై అమలు చేయాలాన్నారు. ఆయనపై చీటింగ్, ల్యాం డ్ కబ్జాలకు సంబంధించిన 82 కేసులున్నా యన్నారు. కేసులకు భయపడమని ప్రశ్ని స్తూనే ఉంటామని అన్నారు.