హైదరాబాద్ : బీఆర్ఎస్ రాజకీయ పాచకతో సభను స్తంభింపజేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నా ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తివేయాలని ఎప్పుడైనా చెప్పారా..? అని సీఎం ప్రశ్నించారు. నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందువరుసలో ఉన్నారని, ఆ తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో తెలుసాని రేవంత్ రెడ్డి అన్నారు. అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని, సబిత, సునీతను సొంత అక్కలుగా భావించానని సీఎం వెల్లడించారు. ఒక అక్క నన్ను నడిబజారులో వదిలేదసి ఏం అనలేదని సీఎం తెలిపారు. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లానని గుర్తుచేశారు. అప్పుడు కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఆయనను నమ్ముకున్న సొంత చెల్లెలే తిహార్ జైలులో ఉన్నారని, ఆమె గురించి మాట్లాడరని ఎద్దేవా చేశారు.