బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హమీలు నెరవేర్చ కుంటే ఏడవ గ్యారంటీ కింద అధికారం కోల్పోవడం ఖాయం అని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమావారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట 14 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించారు. వారు సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన గాడి తప్పిందన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు 14 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం తగదని మండిపడ్డారు.