calender_icon.png 19 October, 2024 | 7:48 PM

రేవంత్, బండి సంజయ్ కలిసి డ్రామాలాడుతున్నారు

19-10-2024 05:40:53 PM

హైదరాబాద్: నిరుద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ కలిసి డ్రామా ఆడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గ్రూప్-1 అభ్యర్థులను చర్యలకు పిలవకపోవడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్-1 అభ్యర్థులను పశువుల్లా చూస్తోందని ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు నిర్ణయం వెలువడేవరకైనా వేచి చూడాలి కదా అన్నారు. బండి సంజయ్ కి భద్రత కల్పించి మరీ ర్యాలీ చేయించారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులను మాత్ర పోలీసులు అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యలపై బండి సంజయ్ ను చర్చలకు పిలిచినా లాభం ఉండదన్నారు. ఆయన ఏం చదువుకున్నారు.. పరీక్షల గురించి ఆయనకేం తెలుసు..? అని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేయడమే ఆయనకు తెలుసు అని కేటీఆర్ విమర్శించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతు తెలపడానికి వచ్చిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐపీఎస్, సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.