calender_icon.png 31 October, 2024 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డి

31-10-2024 01:33:18 AM

  1. జాబితాలో ఖర్గే, సోనియా, రాహుల్‌గాంధీ
  2. 40 మంది పేర్లతో ఎన్నికల సంఘానికి అందజేత 

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి , ఎంపీ కుమారి సెల్జా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి పంపిం చారు. మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏఐసీసీ అవకా శం ఇచ్చింది.

స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోని యాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు.