22-02-2025 12:00:00 AM
నిర్మల్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) ః ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రులు అభ్యర్థి ఏ నరేందర్ రెడ్డి కి మద్దతుగా నిర్మల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని రాష్ర్ట విత్తన కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాజీ మంత్రి డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు వెల్లడించారు. శుక్రవారం నిర్మల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేస్తుందని నిరుద్యోగ యువతకు 53 వేల ఉద్యోగాలను కల్పించడం జరిగిందన్నారు.