calender_icon.png 26 November, 2024 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీకటి ఒప్పందాలు రేవంత్‌కే బాగా తెలుసు

28-08-2024 12:00:00 AM

  1. బీఆర్‌ఎస్ నేతలకు ఉద్యమాలు మాత్రమే తెలుసు
  2. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారు
  3. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతల వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీం ధర్మాసనం కవితకు బెయిల్ ఇవ్వడంతో న్యాయం, ధర్మం గెలిచిందని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం బలపడిందని అన్నా రు. తుది తీర్పులో కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తారని స్పష్టంచేశారు.

సుప్రీం తీర్పును కించపరి చేలా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌గౌడ్ మాట్లాడటంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆయనపై కోర్టు దిక్కరణ కేసు వేస్తామని హెచ్చరించా రు. చీకటి ఒప్పందాలు, మతలబులు సీఎం రేవంత్‌రెడ్డికి బాగా తెలుసున నీ.. తాము ఉద్యమకారులం, న్యాయబద్ధంగా పోరాడుతామని పేర్కొన్నా రు. నిజామాబాద్ బిడ్డ విముక్తురాలై వస్తుంటే జిల్లాకు చెందిన మహేష్‌గౌడ్‌కు ఎందుకింత అక్కసు అని ప్రశ్నిం చారు.

అదే సుప్రీం తీర్పుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, బెయిల్ వచ్చిన ఐదు నిమిషాలకే స్పందించారని మండిపడ్డారు. వాల్మీకి స్కామ్ గురిం చి అన్ని ఆధారాలు ఉన్నా.. బండి ఎందుకు మాట్లాడలేక పోతున్నారని నిలదీశారు. కలిసిపోయింది కాంగ్రెస్, బీజేపీలేనని.. రెండు ఒక్కటై ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి హోదాలో చిల్లర మాట లు మానుకోవాలని హితవు పలికా రు. సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టేలా మాట్లాడి న బండి సంజయ్, మహేష్‌కుమార్‌గౌడ్‌పై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు.