calender_icon.png 21 October, 2024 | 12:00 PM

రేవంత్ సీఎం కాదు.. చీటింగ్ మ్యాన్

21-10-2024 12:22:01 AM

  1. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం సిగ్గుచేటు
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు

మానకొండూర్, అక్టోబర్ 20: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కిన రేవంత్‌రెడ్డి సీఎం కాదని, చీటింగ్ మ్యాన్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డలం కొత్తపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో మానకొం డూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు మా ట్లాడారు. హామీలను విస్మరించిన కాంగ్రెస్‌పై పోరాటానికి బీఆర్‌ఎస్ శ్రేణులంతా నడుం బిగించాల న్నారు. 11 సార్లు కేసీఆఆర్ రైతుబంధు ఇస్తే ఒక్కసారైనా రేవంత్‌రెడ్డి ఇవ్వలేదన్నారు. పింఛన్లు, రైతుబంధు దగా చేశారని ఎద్దేవా చేశారు. రైతులు వరి పంట ను కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నా ఇప్పటికీ ప్రారంభించకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు.

నిరుద్యోగ యువతను కొల్లగొడుతున్న కాంగ్రెస్‌కు రాబోయే రోజు ల్లో గుణపాఠం చెప్పాలన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ముందా అని రేవంత్‌రెడ్డికి సవాల్ విసినారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినో ద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రావుల రమేష్, నాయకులు పెట్టం రమేష్, పొన్నం అనిల్‌గౌడ్ పాల్గొన్నారు.