calender_icon.png 9 November, 2024 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ కాలిగోటికి రేవంత్ సరిపోడు

09-11-2024 12:26:47 AM

  1. విమర్శలు మాని పాలనపై దృష్టిపెట్టాలి
  2. మాజీమంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని, సీఎం స్థాయి దిగజారి మాట్లాడటం మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. శుక్రవారం సుమతీ శతకానికి సంబంధించిన పద్యాన్ని ఎక్స్‌వేదిక పోస్ట్ చేస్తూ ఈ పద్యం సీఎం రేవంత్‌కు సరిగ్గా సరిపోతుందని, తప్పు మీద తప్పులు చేస్తున్నఆయన తీరు ను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

తన పుట్టినరోజున తండ్రి వయస్సున కేసీఆర్ మీద నీఛమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో నడిపిన చరిత్ర బీఆర్‌ఎస్‌కు ఉంద ని, డబ్బు సంచులు మోసి, బ్యాగులు పంచి అడ్డ దారిలో అధికారంలోకి వ చ్చిన నీఛ చరిత్ర రేవంత్‌రెడ్డిదన్నారు. 

ప్రభుత్వ పనితీరు బయటపడింది

గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం, అలస త్వం ప్రదర్శిస్తుందని హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ గురుకుల విద్యార్థుల కష్టాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫుడ్ పాయిజనింగ్‌తో మం చిర్యాలలో 12 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన గడిచి 24 గంటలు కూడా కాకముందే, మరోసారి వాంతులు, కడుపునొప్పితో వి ద్యార్థులు ఆసుపత్రికి తీసుకెళ్లడం బాధకరమన్నారు. నిర్మల్, వాంకిడి, మంచిర్యాల గురుకులాల్లో ఇప్పటి వరకు 94 మంది ఆసుపత్రుల పాలు కాగా, ఇంద్రవెల్లి, నిర్మల్ గురుకులాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జ్వరంతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. 

నిర్బంధాలు ఎందుకు!

సీఎం రేవంత్‌రెడ్డి కనీసం తన పుట్టిన రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని కోరారు.